భారతదేశం, అక్టోబర్ 27 -- మెుంథా ఎఫెక్ట్ చూపిస్తుంది. కోస్తా జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. తుపాను తీరానికి దగ్గరవుతున్న కొద్దీ ప్రభావం పెరుగుతూనే ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. గడిచిన ఆరు గంటల్లో 17 కిలోమీటర్ల వేగంతో కదిలింది తుపాను. మంగళవారం ఉదయం నాటికి తీవ్ర తుపానుగా మారనుంది. మంగళవారం రాత్రికి తీరం దాటనుంది. ఈ సమయంలో గంటలకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.

మెుంథా తుపాను ప్రభావం నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు అధికారులతో సమావేశం అవుతూనే ఉన్నారు. పునరావాస కేంద్రాల్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే పునరావాస కేంద్రాల్లోని ఒక్కో కుటుంబానికి రూ.3 వేల చొప్పున అందిస్తామని ప్రకటించారు.

ఇక తుపాను ఎఫెక్ట్ రాకపోకలపై...