భారతదేశం, అక్టోబర్ 28 -- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెుంథా తుపాను ఎదుర్కోవడానికి అధికారులను సిద్ధం చేసింది. ప్రజలకు సహాయం చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా 558 కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసింది. వీటిలో ఒక రాష్ట్ర స్థాయి, 19 జిల్లా, 54 డివిజనల్, 484 మండల/గ్రామ స్థాయి కంట్రోల్ రూమ్‌లు ఉన్నాయి. ఇవన్నీ అత్యవసర పరిస్థితులకు స్పందించడానికి 24x7 పనిచేస్తాయి. సమర్థవంతమైన కమ్యూనికేషన్ కోసం 16 శాటిలైట్ ఫోన్‌లు, 35 డీఎంఆర్ సెట్‌లు కూడా జిల్లాలకు పంపిణీ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,194 సహాయ శిబిరాలను సిద్ధం చేశారు. 3,465 మంది గర్భిణీ, పాలిచ్చే మహిళలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. సహాయ, రక్షణ కార్యకలాపాల కోసం 11 ఎన్డీఆర్ఎఫ్, 12 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను ఎక్కువగా ప్రభావితమయ్యే జిల్లాల్లో మోహరించారు. అదనపు బృందాలు రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో కూడా సిద్ధంగా ఉన్న...