భారతదేశం, అక్టోబర్ 26 -- మెుంథా తుపానుతో ఏపీలో భారీ వర్షాలు పడనున్నాయి. ఈ కారణంగా ఏపీ ప్రభుత్వం పలు జిల్లాల విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే విశాఖపట్నం, అనకాపల్లి, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఈ నెల 27 నుంచి రెండురోజులపాటు సెలవు ఇచ్చారు. సీఎం చంద్రబాబ ఆదేశాల మేరకు విశాఖపట్నం జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కాలేజీలకు ఈ నెల 27, 28వ తేదీల్లో సెలవులు ప్రకటిస్తూ.. జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. పరిస్థితుల ఆధారంగా తర్వాత కూడా సెలవులు పొడిగించే అవకాశం ఉంది.

మరోవైపు అనకాపల్లి జిల్లాలో విద్యాసంస్థలకు 27, 28, 29 తేదీల్లో మూడు రోజులపాటు సెలవులు ఇస్తూ కలెక్టర్ విజయ కృష్ణన్ ఉత్తర్వులు ఇచ్చారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి.. విద్యా సంస్థలను తెరిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. తూర్పుగోదావరి జిల...