భారతదేశం, నవంబర్ 5 -- ఏపీలో మెుంథా తుపాను తీవ్రంగా ప్రభావం చూపించింది. భారీగా పంట నష్టం జరిగింది. పంట నష్టం వివరాలు అందించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. తాజాగా ఈ పంట నష్టం గడువును మరో రెండు రోజులు పొడిగించినట్టుగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లా సమీక్ష మండలి సమావేశంలో అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఆయనతోపాటుగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు. తుపాను ప్రభావంతో నష్టపోయిన ప్రతీ రైతుకు పరిహారం అందిస్తామని అన్నారు. కొంతమంది రైతుల పంట నష్టం వివరాలు నమోదు కాలేదని తెలిసిందని అందుకే పొడిగిస్తున్నట్టుగా తెలిపారు. రాష్ట్రంలో ఈ క్రాప్ నమోదు వందశాతం జరిగిందన్నారు. ఈ క్రాప్ నమోదు చేయలేదని జగన్ రెడ్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.