భారతదేశం, అక్టోబర్ 26 -- మెుంథా తుపాను ప్రభావంతో అక్టోబర్ 28, 29 తేదీల్లో తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఏపీకి ఇప్పటికే హై అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు దంచికొట్టనున్నాయి. తెలంగాణ అంతటా కూడా దీని ప్రభావం ఉండనుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం అక్టోబర్ 28 ఉదయం నాటికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది. అక్టోబర్ 28 సాయంత్రం లేదా రాత్రి మచిలీపట్నం, కళింగపట్నం మధ్య తీరాన్ని దాటుతుందని, గంటకు 90-110 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని అంచనా.

ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అన్ని జిల్లాల యంత్రాంగాలను, ముఖ్యంగా తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని, మెుంథా తుపాను ప్రభావం అధికంగా ఉండే ప్రాంతాల్లోని ప్రజలను అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించా...