భారతదేశం, అక్టోబర్ 27 -- మెుంథా తుపాను ఆంధ్రప్రదేశ్‌వైపు వేగంగా దూసుకొస్తుంది. దీంతో రాష్ట్రంలో పరిస్థితులు మారుతున్నాయి. పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులు వీస్తున్నాయి. తుపాను పరిస్థితిపై సీఎం చంద్రబాబు కలెక్టర్లు, ఎస్పీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పునరావాస కేంద్రాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని చెప్పారు. ప్రజలు ఇబ్బందులు రాకుండా ఉండాలని ఆదేశాలు ఇచ్చారు.

అంతేకాదు పునరావాస కేంద్రాల్లో ఉన్న ఒక్కో కుటుంబానికి రూ.3 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించారు సీఎం చంద్రబాబు. కుటుంబానికి 25 కిలోల బియ్యం, నిత్యావసరాలు పంపిణీ చేయాలన్నారు. పునరావాస కేంద్రాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లాల్లో అత్యవసర వైద్య సేవలు అందించే సిబ్బంది అందుబాటులో ఉండాలని చెప్పారు.

'రాష్ట్రంపై మొంథా తుపాను ప్రభావాన్ని గంటగ...