భారతదేశం, అక్టోబర్ 28 -- మెుంథా తీవ్ర తుపానుగా మారి ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ప్రభావం చూపిస్తుంది. తీరం వైపు దూసుకొస్తున్న కొద్ది పరిస్థితులు మారుతున్నాయి. ఈదురుగాలులు, వర్షాలు పడుతున్నాయి. అక్టోబర్ 29వ తేదీ ఉదయం వరకు ఏపీలోని గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి,నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం జిల్లాలకు ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉంది.

అలాగే తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలు, ఒడిశాలోని గజపతి, గంజాం జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది.

పశ్చిమమధ్య బంగాళాఖాతంలో మొంథా తీవ్ర తుపాన్.. గడిచిన గంటలో 10 కి.మీ వేగంతో కదిలిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దగ్గరకు వచ్చే కొద్ది తీవ్ర ప్రభావం చూపుతుంది. కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవక...