భారతదేశం, అక్టోబర్ 29 -- తీవ్రమైన మెుంథా తుపాను ఆంధ్రప్రదేశ్ తీరాన్ని మచిలీపట్నం, కళింగపట్నం మధ్య (కాకినాడకు దక్షిణంగా నర్సాపూర్ సమీపంలో) దాటింది. తరువాత తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. మెుంథా ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు భారీగా పడుతున్నాయి.

తెలంగాణలోని దక్షిణ, మధ్య, ఉత్తర ప్రాంతాలలో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. అక్టోబర్ 29 (బుధవారం) నాగర్ కర్నూల్ జిల్లాలో తుపాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని, 200 మి.మీ వరకు వర్షపాతం నమోదవుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు.

యాదాద్రి-భువనగిరి, జనగాం, సిద్దిపేట, హన్మకొండ, వరంగల్, సూర్యాపేట, మహబూబాబాద్, ఖమ్మం సహా అనేక ఇతర జిల్లాల్లో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. లోతట్టు ప్రాంతాల నివాసితులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది...