భారతదేశం, నవంబర్ 28 -- ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలోనే గొప్ప ఆటగాళ్లలో (GOAT - Greatest Of All Time) ఒకరిగా పరిగణించే అర్జెంటీనా లెజెండ్ లియోనెల్ మెస్సీ తన అభిమానులకు శుభవార్త చెప్పారు. భారత్‌లో నాలుగు నగరాల్లో పర్యటించే తన 'GOAT టూర్'లో తాజాగా హైదరాబాద్‌ను కూడా చేర్చారు. కోల్‌కతా, ముంబై, ఢిల్లీ నగరాలతో పాటు ఇప్పుడు తెలంగాణ రాజధానిలో కూడా మెస్సీ సందడి చేయనున్నారు.

ఈ పర్యటనకు సంబంధించి మెస్సీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. "భారతదేశం నుండి లభించిన ప్రేమకు ధన్యవాదాలు! మరో కొన్ని వారాల్లో GOAT టూర్ మొదలవుతుంది!! కోల్‌కతా, ముంబై, ఢిల్లీ నగరాల పర్యటనకు హైదరాబాద్‌ను కూడా చేర్చినందుకు చాలా సంతోషంగా ఉంది. త్వరలోనే కలుద్దాం ఇండియా!" అని రాసుకొచ్చారు.

మెస్సీ డిసెంబర్ 13న సాయంత్రం హైదరాబాద్‌ చేరుకుంటారు. అదే రోజు రాత్రి రాజీవ్ గాంధీ అంతర్జాతీ...