భారతదేశం, ఏప్రిల్ 25 -- ఖాళీ అయిన కాస్లీ లిక్కర్ బాటిల్స్లో.. చీప్ లిక్కర్ మిక్స్ చేసి అమ్ముతున్న ఇద్దరిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని ట్రూప్స్ బార్లో ఈ కల్తీ లిక్కర్ బాగోతం బయటకు వచ్చింది. కల్తీ చేస్తున్న సత్యనారాయణ రెడ్డి, పునీత్ పట్నాయక్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎక్సైజ్ అధికారుల దాడుల్లో ఈ దందా వెలుగులోకి వచ్చింది.

రూ.2,690 విలువైన జెమిసన్ లిక్కర్ బాటిల్లో.. వెయ్యి రూపాయలకు వచ్చే ఓక్ స్మిత్ లిక్కర్ మిక్స్ చేస్తున్నారు. ఈ సమయంలో ఎక్సైజ్ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. చీప్ లిక్కర్తో నింపిన 75 బాటిళ్లను, 55 ఖాళీ సీసాలను ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. బయట వైన్స్, ఇతర ఈవెంట్లలో లభించిన ఖాళీ మద్యం బాటిళ్లను కొనుగోలు చేసి ఈ దందా చేస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు.

ముందుగా నగరంలోని పలు వైన...