భారతదేశం, ఆగస్టు 20 -- స్త్రీలలో పునరుత్పత్తి దశ ముగిసే ప్రక్రియనే మెనోపాజ్ (Menopause) అని పిలుస్తారు. సాధారణంగా, వరుసగా 12 నెలల పాటు రుతుస్రావం ఆగిపోయినప్పుడు మెనోపాజ్ వచ్చిందని పరిగణిస్తారు. ఇది సహజంగా జరిగే ప్రక్రియ అయినప్పటికీ, దీని గురించి సమాజంలో ఎన్నో అపోహలు, అపార్థాలు ప్రచారంలో ఉన్నాయి. ఈ అపోహలన్నీ తొలగిస్తే మహిళలు ఈ దశను సానుకూల దృక్పథంతో, సరైన ఆరోగ్య నిర్ణయాలతో స్వాగతించవచ్చని గురుగ్రామ్‌లోని సీకే బిర్లా హాస్పిటల్ గైనకాలజీ డైరెక్టర్ డాక్టర్ ఆస్థా దయాల్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మెనోపాజ్ గురించి ఉన్న 7 అపోహలను ఆమె వివరించారు.

వాస్తవం: మెనోపాజ్ అనేది ఒక్కసారిగా వచ్చేది కాదు. ఇది క్రమంగా జరిగే ప్రక్రియ. దీనికి కొన్ని సంవత్సరాల సమయం పట్టవచ్చు. ఈ దశలో హార్మోన్ల స్థాయిలు స్థిరంగా ఉండవు, దీనివల్ల రుతుస్రావం క్రమరహితంగా...