భారతదేశం, సెప్టెంబర్ 13 -- వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని భావించిన ఓ తల్లి. రెండేళ్ల కన్న కూతురిని హత్య చేసింది. ఈ దారుణమైన ఘటన మెదక్‌ జిల్లాలో వెలుగు చూసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్‌ జిల్లా శివ్వంపేట మండలం శబాష్‌పల్లికి చెందిన బొట్టు మమతకు ఇదే గ్రామానికి చెందిన షేక్ ఫయాజ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం నడుస్తోంది. మమత ఓ కుమారుడుతో పాటు 2 ఏళ్ల కుమార్తె కూడా ఉంది. అయితే మే నెల నుంచి మమతతో పాటు కుమార్తె కూడా కనిపించటం లేదు. దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు. పోలీసులను ఆశ్రయించారు.

మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా గురువారం వీరిని గుంటూరులో అదుపులోకి తీసుకున్నారు. అయితే మమత(23). కూతురు కనిపించకపోవడంతో ఏం చేశారని పోలీసులు వి...