భారతదేశం, నవంబర్ 19 -- గత కొంతకాలంగా అవినీతి అధికారులు భరతం పడుతోంది తెలంగాణ ఏసీబీ. పక్కా సమాచారంతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటోంది. తాజాగా మెదక్ జిల్లాలోని టేక్మాల్ మండలంలో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న రాజేశ్ ఏసీబీకి చిక్కాడు. రూ. 30 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డాడు.

ఏసీబీ విడుదల చేసిన ప్రకటనలోని వివరాల ప్రకారం.. ఫిర్యాదుదారుడితో పాటు అతని సహచరులపైన టేక్మాల్ రక్షక భట నిలయంలో ఓ కేసు నమోదైంది. ఈ కేసులోని నిందితులకు నోటీసులు జారీ చేసినందుకు (ఈ కేసు లోక్ అదాలత్‌లో పరిష్కరించబడింది) ఫిర్యాదుదారుడి నుండి రూ.30,000 లంచం డిమాండ్ చేశాడు.దీంతో ఫిర్యాదుదారుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పక్కాగా ప్లాన్ చేసిన ఏసీబీ అధికారులు. ఎస్సై రాజేశ్ రూ. 30 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఏసీబీ అధికారులు ...