Telangana,kamareddy, ఆగస్టు 27 -- తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. ఉమ్మడి మెదక్‌, నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చాలాచోట్ల వరద ఏరులై పారుతోంది. పలుచోట్ల వాహనాలు కొట్టుకుపోయిన పరిస్థితులు నెలకొన్నాయి. ఆయా జిల్లాల యంత్రాగాలు సహాయక చర్యలు చేపట్టాయి.

భారీ వర్షాలతో కామారెడ్డి జిల్లా అంతా అతలాకుతమవుతోంది. జిల్లాలోని చాలాచోట్ల వరద ఏరులై పారుతోంది. దీంతో పలు గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. కామారెడ్డి పట్టణంలోని పలు కాలనీలు, లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. పలు కాలనీల్లో కార్లు కొట్టుకుపోయాయి.

భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో కామారెడ్డి జిల్లా పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు రేపు(ఆగస్ట్ 28) సెలవు ప్రకటించారు. మరోవైపు కామారెడ్డి -భిక్కనూర్‌ మార్గంలో రైలు పట్టాల కింద వరద భారీగా పారుతోంది. ...