భారతదేశం, జూన్ 17 -- క్యాన్సర్‌ను జయించిన వారి అద్భుతమైన స్ఫూర్తిని, ధైర్యాన్ని అభినందిస్తూ మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఈ జూన్ నెలను 'క్యాన్సర్ సర్వైవర్స్ మంత్‌'గా గ్రాండ్‌గా నిర్వహించింది. "సెలబ్రేటింగ్ ది సూపర్ హీరోస్" అనే థీమ్‌తో జరిగిన ఈ వేడుకల్లో క్యాన్సర్‌ను గెలిచిన వారితో పాటు, వారి కుటుంబ సభ్యులు, వైద్య నిపుణులు, హాస్పిటల్ సిబ్బంది ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి నేషనల్ ప్రైడ్ అండ్ బ్యూటీ ఐకాన్ మిసెస్ ఇండియా తెలంగాణ క్రౌన్ విజేత 2025 మితాలీ అగర్వాల్, క్యాన్సర్ ఫైటర్ సుమంతి చూరుకంటి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. వారు తమ వ్యక్తిగత అనుభవాలను అందరితో పంచుకుంటూ, క్యాన్సర్‌తో పోరాడి గెలిచిన ప్రతి ఒక్కరికీ గొప్ప స్ఫూర్తినిచ్చే ప్రసంగాలు చేశారు.

ఈ సందర్భంగా మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ప్రముఖ వైద్య నిపుణ...