భారతదేశం, ఏప్రిల్ 23 -- వరంగల్ నగరంలోని శివనగర్ ఏరియాకు చెందిన ఇట్టబోయిన రాజ్ కుమార్, రజిత దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నాడు. వీరిది సామాన్య మధ్య తరగతి కుటుంబం. ఈ కుటుంబానికి చెందిన సాయిశివానీ సివిల్స్‌లో 11వ ర్యాంకు సాధించారు.

రాజ్ కుమార్ మెడికల్ రిప్రజెంటేటివ్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా, తల్లి గృహిణి. వారి పెద్ద కుమార్తె ఇట్టబోయిన సాయి శివాని సివిల్స్‌లో ఏకంగా 11వ ర్యాంకు సాధించింది. కడపలో ట్రిపుల్ ఐటీలో పీయూసీ, ఆ తరువాత 2022లో బీటెక్ పూర్తి చేసింది. మధ్య తరగతి కుటుంబం కావడంతో పిల్లలను ఉన్నతంగా చదివించడానికి రాజ్ కుమార్ నిరంతరం శ్రమించాల్సి వచ్చేది.

తల్లిదండ్రుల కష్టాన్ని చూడలేక సాయి శివాని, ఎలాగైన ఐఏఎస్ కావాలని టార్గెట్ పెట్టుకుంది. ఈ మేరకు యూపీఎస్సీ పరీక్షలకు ప్రణాళిక ప్రకారం కష్టపడి చదివింది. ఈ క్రమంలో ఓ వైప...