భారతదేశం, డిసెంబర్ 18 -- 10 మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్ సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి గురువారం లోక్ భవన్ లో గవర్నర్ అబ్దుల్ నజీర్ కు కోటి మందికి పైగా సంతకాలను సమర్పించారు. కోటి సంతకాల ఉద్యమాన్ని గవర్నర్‌కు వివరించారు. మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాలను సేకరించినట్లు తెలిపారు.

వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ గత కొంతకాలంగా పోరాడుతోంది. ఇందులో భాగంగా ప్రజల నుంచి కోటి సంతకాల సేకరణ ఉద్యమానికి సేకరణకు శ్రీకారం చుట్టింది. జగన్ ఆదేశాల మేరకు. ఈ కార్యక్రమం పూర్తికాగా సేకరించిన కాపీల వివరాలను గవర్నర్ కు అందజేశారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన వైఎస్ జగన్.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన అన్యాయాలను గవర్నర్ దృష్టికి తీసుకొచ్చామన్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించితే కలిగే నష్టాల...