భారతదేశం, అక్టోబర్ 9 -- ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ) మోడల్‌లో 10 వైద్య కళాశాలలు, అనుబంధ ఆసుపత్రులను ఏర్పాటు చేయడానికి పోటీ బిడ్డింగ్ ప్రక్రియపై మధ్యంతర స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. నిధుల కొరత కారణంగా రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ నమూనాలో వైద్య కళాశాలలను అభివృద్ధి చేయాలని విధాన నిర్ణయం తీసుకుని ఉండవచ్చని అభిప్రాయపడింది. ప్రభుత్వ విధాన నిర్ణయాన్ని తప్పుపట్టలేమని, ఈ విషయంలో సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని హైకోర్టు తెలిపింది.

తాడేపల్లికి చెందిన కుర్ర వసుంధర అనే మహిళ పది వైద్య కళాశాలలను పీపీపీ మోడల్‌లో అభివృద్ధి చేయాలని ప్రతిపాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాలు చేస్తూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషనర్ తరపున మాజీ అడ్వకేట్ జనరల్ ఎస్ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 2024లో పనులను న...