భారతదేశం, నవంబర్ 6 -- కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై క్షేత్రస్థాయిలో పోరాడేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పిలుపునిచ్చారు. గురు­వారం పార్టీ విద్యార్థి విభా­గం రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా, అసెంబ్లీ ని­యో­జకవర్గాల అధ్యక్షులతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ... కల్మషం లేని రాజకీయాలు ఉన్నాయని చెప్పుకునే పరిస్థితి రావాలంటే దానికి బీజం పడాల్సింది యువతలోనే అన్నారు. రాజకీయాల్లో యువతంతా తులసి మొక్కల్లా ఎదగాలని. యువత గట్టిగా అడుగు వేస్తే దేశాల్లో గవర్నమెంట్లే మారిపోతున్నాయని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఒకలెక్కా..? అని ప్రసంగించారు.

"ఓటు హక్కు లేదు కనుక విద్యార్థుల గురించి ఏ రాజకీయ నాయకుడు ఆలోచించడు. ఇంగ్లీష్ మీడియం నుంచి నాడు నేడుదాకా వారి గురించి అడుగులు వేసింది వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమే...