Narsipatnam,andhrapradesh, అక్టోబర్ 9 -- కూటమి ప్రభుత్వం ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరించడాన్ని నిరసిస్తూ వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఇవాళ అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నం వైద్య కళాశాలను సందర్శించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్‌ కాలేజీలను ప్రైవేట్‌పరం చేస్తే పేదోడికి వైద్యం ఎలా అందుతుంది.? అని ప్రశ్నించారు.నర్సీపట్నంలో 52 ఎకరాల్లో మెడికల్‌ కాలేజీ నిర్మాణం చేపట్టామని చెప్పారు. 2022, డిసెంబర్‌ 30న శంకుస్థాపన చేశామని గుర్తు చేశారు. కొవిడ్ పరిస్థితులను అధిగమించి రూ. 500 కోట్లతో ఈ మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేశామన్నారు. ఈ కాలేజీ పూర్తి అయి ఉంటే పరిస్థితులు మారేవి. పక్కనే ఉన్న పార్వతీపురం మెడికల్ కాలేజీ పూర్తయి ఉంటే..అస్వస్థతకు గురైన గిరిజన విద్యార్థులకు వైద్యం అం...