Hyderabad, ఆగస్టు 18 -- విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ సుమతీ శతకం. రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతోన్న సుమతీ శతకం సినిమాలో బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ చౌదరి, సైలీ హీరో హీరోయిన్లుగా చేస్తున్నారు.

సుమతీ శతకం సినిమాకు ఎంఎం నాయుడు దర్శకత్వం వహిస్తున్నారు. గత కొన్ని రోజుల క్రితం ఈ మూవీ నుంచి హీరోయిన్ సైలీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసి అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. రీసెంట్‌గా అమర్ దీప్ చౌదరి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.

కృష్ణాష్టమి సందర్భంగా ఆగస్ట్ 16 సుమతీ శతకం నుంచి హీరో పాత్రగా అమర్ దీప్‌ను పరిచయం చేశారు. ఈ సినిమాల అమర్ దీప్ ఓ మిడిల్ క్లాస్ కుర్రాడిలా కనిపించబోతున్నారు. ఇక సుమతీ శతకంలోని అమర్ దీప్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చూస్తుంటే ...