Hyderabad, జూన్ 17 -- చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం అనుసరించడం వలన సానుకూల శక్తి వ్యాపిస్తుంది. ఎలాంటి ప్రతికూల శక్తి ఉన్నా సరే తొలగిపోతుంది. వాస్తు ప్రకారం పాటించడం వలన సమస్యలు కూడా తొలగిపోతాయి. చాలా మంది ఇంటిని నిర్మించేటప్పుడు కూడా వాస్తు ప్రకారం వారి ఇంటిని నిర్మిస్తారు. వాస్తు ప్రకారం చాలా మంది కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. వాటిని సరి చేసుకుంటే ఇబ్బందుల నుంచి బయటపడడానికి అవుతుంది.

ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించాలంటే ఇంట్లో ఉన్న గదులు అన్నీ కూడా వాస్తు ప్రకారం ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే ఏ దిశలో బరువు ఉండొచ్చు, బరువు ఉండకూడదు వంటివి కూడా చూసుకోవాలి. ఏ దిశలో మంచం ఉండాలి, తల ఎటువైపు పెట్టుకుని నిద్రపోవాలి ఇటువంటివన్నీ కూడా చూసుకోవాలి.

వీటితో పాటుగా ఇంట్లో బాత్రూమ్‌ని ఏ దిశలో కట్టుకోవాలి అనేది కూడా తెలుసుకోవ...