Hyderabad, మే 22 -- మంచు మనోజ్ నటించిన భైరవం మూవీ డైరెక్టర్ విజయ్ కనకమేడల తన ఎక్స్ అకౌంట్ ద్వారా మెగా ఫ్యామిలీ అభిమానులకు క్షమాపణ చెప్పాడు. వాళ్లను అవమానించేలా అతని ఫేస్‌బుక్ పేజ్ లో ఉన్న ఓ పోస్ట్ గురువారం (మే 22) సాయంత్రం నుంచి వైరల్ కావడంతో బాయ్‌కాట్ భైరవం అంటూ మెగా ఫ్యాన్స్ పిలుపునిచ్చారు. దీంతో విజయ్ వెంటనే రంగంలోకి దిగి దిద్దుబాటు చర్యలు చేపట్టాడు.

భైరవం మూవీ డైరెక్టర్ విజయ్ కనకమేడల 2011లో తన ఫేస్‌బుక్ పేజీలో చిరంజీవి, రామ్ చరణ్ లను అవమానించేలా చేసిన పోస్ట్ అంటూ గురువారం (మే 22) సాయంత్రం నుంచి ఓ ఫొటో వైరల్ అయింది. అందులో అమితాబ్, అభిషేక్ కలిసి నటించిన పా మూవీ పోస్టర్ ను మార్చేసి చిరంజీవి, రామ్ చరణ్ తో మార్చినట్లు ఉంది.

దానికి టైటిల్ ను చా (Chaaaaaa) అని పెట్టారు. సామాజిక న్యాయం ప్రెజెంట్స్ "చా" అనే క్యాప్షన్ తో ఆ ఫొటోను విజయ్ కనకమే...