భారతదేశం, మే 14 -- ఏపీ మెగా డిఎస్సీ ఉద్యోగాలకు పోటీ తీవ్రంగా ఉంది. 16వేల పోస్టులకు మూడు లక్షల మంది దరఖాస్తు చేశారు. డీఎస్సీ పరీక్షకు హాజరవ్వటం, దానికి ప్రిపేర్ అవటం, విజేతలు కావటం అభ్యర్థుల ముందున్న అసలైన సవాళ్లు. ఈ క్రమంలో నియోజక వర్గంలో నిరుద్యోగుల కోసం పాలకొల్లులో మంత్రి నిమ్మల సొంత నిధులతో శిక్షణా శిబిరాన్ని నిర్వహించారు.

డిఎస్సీలో ఉద్యోగాన్ని సాధించడానికి నిరుద్యోగులు అష్ట కష్టాలు పడుతుంటారు. ఆర్థిక ఇబ్బందులు, దూర ప్రాంతాలకు వెళ్లి శిక్షణ పొందడం, వంటి కనిపించని కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది పడిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ సందర్భంగా పాలకొల్లు నియోజకవర్గానికి చెందిన కొందరు ఉపాధ్యాయ ఉద్యోగార్ధులు మంత్రి నిమ్మల రామానాయుడు ను కలిసి అవనిగడ్డలో శిక్షణకు పంపటానికి సిఫారసు చేయమని అడిగారు. శిక్షణకు అయ్యే ఖర్చులు, ఇతర క...