భారతదేశం, జనవరి 20 -- మెగాస్టార్ హా మజాకా! 70 ఏళ్ల వయసులోనూ బాక్సాఫీస్ దగ్గర చిరంజీవి క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. పైగా రికార్డుల జోరు కొనసాగుతోంది. మన శంకర వర ప్రసాద్ గారు మూవీతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నారు చిరు. సంక్రాంతి సందర్భంగా రిలీజైన ఈ మూవీ రికార్డుల దుమ్ము దులుపుతోంది.

అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మన శంకర వర ప్రసాద్ గారు చిత్రం ఇండియాలో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. సక్నిల్క్ ప్రకారం చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రం 8 రోజుల్లో దేశీయంగా రూ.165 కోట్లకు పైగా వసూలు చేసింది. 'మన శంకర వర ప్రసాద్ గారు' సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న థియేటర్లలో విడుదలైంది.

నివేదిక ప్రకారం ప్రీమియర్‌ల నుండి మన శంకర వర ప్రసాద్ గారు చిత్రం రూ.9.35 కోట్లు వసూలు చేసింది. మొదటి రోజు రూ.32.25 కోట్లు, 2వ రోజు ...