భారతదేశం, నవంబర్ 11 -- తమన్నా ఈమధ్య వరుస ఐటెమ్ సాంగ్స్ లో మెరుస్తున్న విషయం తెలుసు కదా. ఇప్పుడు మరోసారి చిరంజీవితో స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వస్తున్న మన శంకర వరప్రసాద్ గారు మూవీలో ఆమె కనిపించనున్నట్లు తెలుస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా మూవీ 'మన శంకర వరప్రసాద్ గారు' షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. 'సంక్రాంతికి వస్తున్నాం' ఫేమ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పూర్తిస్థాయి కామెడీ ఎంటర్‌టైనర్ గా రూపొందుతోంది. ఈ మూవీ వచ్చే సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది.

ఈ సినిమాలో విక్టరీ వెంకటేశ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా టాలీవుడ్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన సమాచారం వైరల్ అవుతోంది. అదేమిటంటే స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా ఈ సినిమాలో ఒ...