భారతదేశం, జనవరి 16 -- మెగాస్టార్ చిరంజీవి హీరగా నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 'మన శంకర వర ప్రసాద్ గారు' (MSVPG). సంక్రాంతి సందర్భంగా జనవరి 12న థియేటర్లలో విడుదలైంది ఈ చిత్రం. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ కామెడీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ పాజిటివ్ టాక్ తో సాగిపోతుంది. బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతోంది.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఫ్యామిలీ చిత్రం మన శంకర వర ప్రసాద్ గారు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ప్రదర్శన కనబరుస్తోంది. సక్నిల్క్ ప్రకారం చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం దేశీయంగా రూ.100 కోట్ల క్లబ్‌లోకి ప్రవేశించింది. సంక్రాంతి రోజు (జనవరి 15) ఈ మూవీ ఇండియాలో రూ.24.14 కోట్ల నెట్ వసూళ్లు కథలో వేసుకుందని ట్రేబ్ అనలిస్ట్ వెబ్ సైట్ సక్నిల్క్ పేర్కొంది.

చిరంజీవి హీరోగా వచ్చిన మన శంకర వర ప్రసాద్ గారు సినిమా ఇండి...