భారతదేశం, జనవరి 12 -- సినిమా అంటే రంగుల ప్రపంచం, స్టాక్ మార్కెట్ అంటే అంకెల ప్రపంచం! ఈ రెండింటికీ సంబంధం ఏంటి అనుకుంటున్నారా? ఉంది! ఒక సాధారణ మధ్యతరగతి కుర్రాడు.. ఏ అండ లేకుండా వచ్చి, తెలుగు సినిమా మార్కెట్ విలువను వందల కోట్లకు పెంచి, చరిత్రలో తనకంటూ ఒక పేజీ రాసుకుని, దశాబ్దాల పాటు 'నెంబర్ వన్' స్థానంలో నిలబడటం వెనుక ఒక పక్కా ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీ ఉంది. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.

1. బ్లూచిప్ స్టాక్ లాంటి 'క్రెడిబిలిటీ'-

స్టాక్​ మార్కెట్‌లో బ్లూచిప్ కంపెనీలు (లార్జ్​ క్యాప్​) ఎలాగైతే ఒడిదుడుకులను తట్టుకుని నిలబడతాయో, చిరంజీవి కూడా దశాబ్దాలుగా తన క్రెడిబిలిటీని అలానే కాపాడుకున్నారు. మూవీ రిజల్ట్‌తో సంబంధం లేకుండా, 'చిరంజీవి సినిమా అంటే మినిమం గ్యారెంటీ' అనే నమ్మకాన్ని క్రియేట్ చేశారు.

స్టాక్ మార్కెట్‌లో మీరు ఎంచుకునే కంపెనీ కూడా చిరంజ...