Hyderabad, ఆగస్టు 6 -- మెగాస్టార్ మమ్ముట్టి ఈ ఏడాది మొదట్లో నటించిన మూవీ డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్. ఇదో థ్రిల్లర్ సినిమా. ఎప్పుడో జనవరి 23నే రిలీజైంది. కానీ ఇప్పటికీ డిజిటల్ ప్రీమియర్ కు నోచుకోలేదు. ఆ వార్త కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. మొత్తానికి త్వరలోనే ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మమ్ముట్టి నటించిన మిస్టరీ కామెడీ థ్రిల్లర్ మూవీ డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి. ఈ ఓటీటీ త్వరలోనే డిజిటల్ ప్రీమియర్ చేయడానికి సిద్ధమవుతోంది.

జనవరిలోనే థియేటర్లలో రిలీజై మంచి టాక్ సొంతం చేసుకొని ఐఎండీబీలో 7 రేటింగ్ సొంతం చేసుకున్న సినిమా కావడంతో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ పై ఆసక్తి నెలకొంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వచ్...