భారతదేశం, అక్టోబర్ 25 -- మెగాస్టార్ చిరంజీవి వ్యక్తిగత హక్కులకు అడ్-ఇంటరిమ్ ఇంజంక్షన్(మధ్యంతర ఉత్తర్వులు)ను హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు మంజూరు చేసింది. ఈ ఆర్డర్స్ ఆధారంగా పిటిషన్‌లో పేర్కొన్న పేరు పొందిన పలువురితోపాటుగా ఎవరైనా వ్యక్తి లేదా సంస్థ చిరంజీవి వ్యక్తిత్వ, ప్రచార హక్కులను ఉల్లంఘన చేసే విధంగా పేరు, ఫొటోలు, వాయిస్ తదితరవాటిని అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించడాన్ని కోర్టు నిషేధించింది.

తన పేరు, చిత్రాల పేర్లు అనుమతి లేకుండా వాడటం, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ వేదికలపై ఉపయోగించడం, ఏఐ ద్వారా మార్ఫ్ చేసిన చిత్రాలు, వీడియోలను ప్రచారం కోసం వాడుకోవడంపై నిషేధం విధించాలని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో చిరంజీవి పిటిషన్ దాఖలు చేశారు.

ఈ సందర్భంగా చిరంజీవి తరఫున న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. చలన చిత్ర రంగంలో అగ్ర హీరోగా ఉన...