భారతదేశం, ఫిబ్రవరి 16 -- మెగాస్టార్ చిరంజీవి గురించి ఒక వార్త ప్రస్తుతం ఫిల్మ్ నగర్ వర్గాల్లో, అభిమానుల్లో చర్చనీయాంశమైంది. చిరంజీవి ఇటీవల కుడి భుజానికి ఒక చిన్నపాటి కీ-హోల్ సర్జరీ (ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ) చేయించుకున్నాడు. ప్రముఖ సర్జన్ డాక్టర్ నితిన్ పర్యవేక్షణలో ఈ సర్జరీ విజయవంతంగా పూర్తయింది. ఈ విషయాన్ని చిరు వెల్లడిస్తూ తన ఆరోగ్య విషయమై ఆందోళన చెందుతున్న అభిమానులకు భరోసా ఇచ్చాడు.

గత కొద్ది రోజులుగా చిరంజీవి కుడి చేతికి ఆర్మ్ స్లింగ్ వేసుకుని కనిపిస్తున్నాడు. ఇటీవల నిర్మాత అల్లు అరవింద్ కుటుంబ సమేతంగా చిరంజీవి నివాసానికి వెళ్ళినప్పుడు, అలాగే బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు చిరు చేతికి కట్టుతో కనిపించాడు. ముఖ్యంగా అల్లు శిరీష్ పెళ్లి పత్రిక ఇవ్వడానికి వెళ్ళినప్పుడు తీసిన ఫోటోల్లో ఆ బ్యాండేజ్ స్పష్టంగా కనిపించింద...