భారతదేశం, ఫిబ్రవరి 11 -- మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టుపై కీలక పరిణామం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం నదీ తీర అభివృద్ధి కోసం అధికారికంగా భూసేకరణ ప్రారంభించడంతో మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు తొలి ప్రధాన అడుగు పడినట్టైంది. ఈ ప్రక్రియను ప్రారంభించడానికి మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌తో ఎంపిక చేసిన ప్రాంతాలలో భూసేకరణను అధికారికంగా ప్రారంభమైంది.

ఈ మేరకు మూసీ అభివృద్ధికి భూసేకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా మెుదలుపెట్టింది. ప్రతిష్టాత్మకమైన మూసీ నది పునరుజ్జీవన ప్రణాళికకు అవసరమైన భూమిని సేకరించడానికి అధికారులు ప్రాథమిక పనులను ప్రారంభించారు. ఫేజ్ ఏ1లో హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 9.2 కిలోమీటర్లు, ఫేజ్ ఏ2లో ఉస్మాన్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 11.8 కిలోమీటర్లు పరిధ...