Hyderabad,telangana, సెప్టెంబర్ 27 -- వరుసగా వర్షాలు, వరదలతో జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో మూసీకి వరద నీటి ప్రవాహం భారీగా పెరిగింది. దీంతో పరివాహక ప్రాంతాల్లో నీటి వరద ఉద్ధృతి ఎక్కువగా ఉంది. అంతేకాకుండా తీర ప్రాంతంలో ఉన్న ఇళ్లు, ఆలయాలతో పాటు ఎంజీబీఎస్ బస్ స్టాండ్ ను వరద ముంచెత్తింది. దీంతో మూసీ పరివాహక ప్రాంతాల్లో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు.

మూసీ పరివాహక ప్రాంతాల్లో పరిస్థితిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. మూసీ వెంట లోతట్టు ప్రాంతాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. ముంపునకు గురయ్యే ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట పునరావాసం కల్పించేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు.

అర్ధరాత్రి ఇమ్లిబన్​​ సమీపంలో ఎంజీబీఎస్​ బస్టాండ్ చుట్టూ నీళ్లు రావటంతో అక్కడ...