Hyderabad, సెప్టెంబర్ 2 -- నటి, అక్కినేని ఇంటి కోడలు అయిన శోభిత ధూళిపాళ మంగళవారం (సెప్టెంబర్ 2) తాను వంట చేస్తున్న ఫొటోలు, వీడియోలను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ సెట్‌లో ఆమె ఈ వంట చేయడం విశేషం. వీటిని పోస్ట్ చేస్తూ గతంలో బేసిన్ హ్యూమన్ స్కిల్స్ తనకు లేవంటూ చైతన్య చేసిన కామెంట్స్ ను గుర్తు చేసేలా క్యాప్షన్ ఉంచింది. దీనికి చైతన్య కూడా స్పందిస్తూ ఫన్నీ కామెంట్ చేశాడు.

శోభిత తన నెక్స్ట్ ప్రాజెక్ట్ సెట్‌లో వంట చేస్తున్న చాలా ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేసింది. ఒక వీడియోలో ఆమె తాను చేసిన సాంబార్ ను చూపిస్తూ కనిపించింది. మరొక వీడియోలో ఆమె బెండకాయలను తరగడం చూడొచ్చు. శోభిత కొన్ని మసాలాలు దంచడానికి ఒక ట్రెడిషనల్ రోలు రోకలిని కూడా బయటికి తీసింది.

ఒక ఫన్నీ ఫొటోలో ఆమె కొబ్బరికాయతో కొడతాను అన్నట్లుగా బెదిరిస్తూ కనిపించింది. ఈ ఫొటో...