భారతదేశం, జూలై 24 -- మీరు ఏదైనా ముఖ్యమైన మీటింగ్‌లో ఇరుక్కుపోయినా, లేదంటే దగ్గర్లో శుభ్రమైన టాయిలెట్ దొరకకపోయినా... ఇలాంటి సందర్భాల్లో చాలామంది మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకుంటూ ఉంటారు. అయితే, ఈ అలవాటు సురక్షితమేనా? అస్సలు కాదని వైద్యులు తేల్చి చెబుతున్నారు. మణిపాల్ ఆసుపత్రి (గురుగ్రామ్) యూరాలజీ విభాగం ప్రిన్సిపల్ కన్సల్టెంట్ డాక్టర్ సందీప్ హర్కర్ హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై పలు విషయాలు వెల్లడించారు.

"చాలా కాలం పాటు మూత్రాన్ని ఆపుకోవడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుంది. మూత్రాశయంలో మూత్రాన్ని ఒక నిర్దిష్ట సమయం వరకు మాత్రమే నిల్వ ఉంచగలం. నిత్యం మూత్రాన్ని ఆపుకోవడం వల్ల మూత్రాశయం సాగిపోతుంది. ఇది క్రమంగా మూత్రాశయం నియంత్రణ కోల్పోవడానికి, మూత్రాన్ని పూర్తిగా ఖాళీ చేయడంలో ఇబ్బందులకు, చివరికి మూత్రం లీకవడానికి క...