Hyderabad, ఏప్రిల్ 29 -- బాలీవుడ్ సీనియర్ నటుడు పరేష్ రావల్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన మోకాలి గాయం గురించి చెప్పిన విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 'ఘటక్' సినిమా షూటింగ్ సమయంలో ఆయన కాలికి గాయమైందని, దాన్ని నయం చేసుకోవడానికి మూత్రం తాగడం ప్రారంభించానని ఆయన వెల్లడించారు. రెండున్నర నెలలు నయం కావాల్సిన గాయం కేవలం పదిహేను రోజుల్లోనే నయం కావడంతో వైద్యులే ఆశ్చర్యపోయారని కూడా పరేష్ చెప్పారు. అయితే, ఈ 'యూరిన్ థెరపీ' వెనుక అసలు నిజాలేమిటి? ఇది నిజంగా పనిచేస్తుందా? ఆధునిక వైద్య శాస్త్రం దీనిని ఎలా పరిగణిస్తుంది? తెలుసుకుందాం రండి..

పరేష్ రావల్ చెప్పినదాని ప్రకారం, ఆయన గాయానికి నానావతి ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. అయితే, యాక్షన్ డైరెక్టర్ వీరూ దేవగణ్ ఆయనను పరామర్శించడానికి వచ్చినప్పుడు, మూత్రం తాగడం వల్ల గాయం త్వరగా నయమవుతుందని సలహా ఇచ్చారు. దీ...