భారతదేశం, డిసెంబర్ 3 -- కోకాపేట నియోపొలిస్ భూముల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వేలం వేస్తే కోట్లలో పలుకుతుంది ధర. అందరి దృష్టి ఇక్కడి వేలంపైనే ఉంటుంది. నియోపొలిస్ భూములకు మూడో విడుత వేలం ప్రక్రియ ముగిసింది. ఇందులో మరోసారి హెచ్ఎండీఏకు భారీగా ఆదాయం సమకూరింది. ప్లాట్ నెంబర్ 19, 20లోని 8.04 ఎకరాలకు అధికారులు ఈ వేలం చేపట్టారు.

ప్లాట్ నెంబర్ 19లో ఎకరానికి రూ.131 కోట్లు పలకగా.. ప్లాట్ నెంబర్ 20లో ఎకరం రూ.118 కోట్ల ధర పలికింది. మూడో విడత వేలంలో 8.04 ఎకరాలకు 1000 కోట్ల వరకు హెచ్ఎండీఏకు ఆదాయం సమకూరింది. 44 ఎకరాల భూమిని నాలుగు విడతల్లో వేలం వేసేందుకు హెచ్ఎండీఏ ప్లాన్ చేసింది. ఇందులో తాజాగా మూడో విడత కూడా ముగిసింది. ఇప్పటి దాకా 27 ఎకరాలకు గానూ.. రూ.3708 కోట్ల ఆదాయం వచ్చింది. డిసెంబర్ 5వ తేదీన నాలుగో విడత వేలం కోకాపేట గోల్డెన్ మైల్‌లోని...