భారతదేశం, డిసెంబర్ 17 -- తెలంగాణలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. దీంతో సర్పంచ్ ఎన్నికలు ముగిసినట్టైంది. మూడో విడుతలోనూ కాంగ్రెస్ పార్టీ జోరు కొనసాగించింది. హస్తం పార్టీ బలపరిచిన అభ్యర్థులు చాలా పంచాయతీలు గెలిచారు. మూడో విడతలో భాగంగా 3752 గ్రామ పంచాయతీలకు, 28410 వార్డులకు పోలింగ్ జరగ్గా.. సర్పంచ్ పదవి కోసం 12,652 మంది, వార్డు మెంబర్లుగా 75,725 మంది బరిలో నిలిచారు.

ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరిగింది. 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేశారు. సుమారు 53 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మూడో విడతలో పల్లె పోరులో 80.78 శాతం పోలింగ్ నమోదైనట్టుగా అధికారులు వెల్లడించారు.

తెలంగాణ రెండో దశ పంచాయతీ ఎన్నికలు డిసెంబర్ 14వ తేదీన జరిగిన విషయం తెలిసిందే. 85.86 శాతం ఓటర్లు ఓటింగ్‌లో పాల్గొన్నారు...