Hyderabad, సెప్టెంబర్ 15 -- మిరాయ్ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్: తేజ సజ్జా సినిమా మరోసారి బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తోంది. హనుమాన్ విజయం తరువాత ఈ యంగ్ హీరో నటించిన మరో సూపర్ హీరో మూవీ మిరాయ్ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.

మిరాయ్ సినిమా ఇండియాలో మూడో రోజు రూ. 16.25 నెట్ కలెక్షన్స్ రాబట్టినట్లు సక్నిల్క్ సంస్థ తెలిపింది. ఈ నెట్ కలెక్షన్లలో హిందీ బెల్ట్ నుంచి రూ. 3.4 కోట్లు, తెలుగు ద్వారా రూ. 12.5 కోట్లు, తమిళనాడులో రూ. 2 లక్షలు, కన్నడలో లక్ష రూపాయలు, మలయాళంలో ఐదు లక్షల వసూల్లు వచ్చినట్లు సమాచారం.

అయితే, రెండో రోజుతో పోలిస్తే మూడో రోజు మిరాయ్ కలెక్షన్స్ 8.33 శాతం తగ్గాయి. ఇక మూడు రోజుల్లో ఇండియా వైడ్‌గా మిరాయ్ సినిమాకు రూ. 57.50 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు అయినట్లు హిందూస్థాన్ టైమ్స్ ఇంగ్లీష్ పేర్కొంది. ఇదిలా ఉంటే, వరల్డ్ వైడ్‌గా...