Hyderabad, జూలై 8 -- బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ ముచ్చటగా మూడో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఇప్పటికే అతడు రెండో భార్య కిరణ్ రావుతో విడిపోయిన విషయం తెలిసిందే. ఈ ఏడాది తన 60వ పుట్టిన రోజు సందర్భంగా తన కొత్త ప్రియురాలు గౌరీ స్ప్రట్ ని మీడియాకు పరిచయం చేశాడు. తాజాగా, సుభాష్ కే ఝాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమిర్.. గౌరీతో తన వివాహ ప్రణాళికల గురించి వివరించాడు.

ఆమిర్ ఖాన్ తన మూడో పెళ్లిపై ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు. ఇప్పటికే తన గర్ల్‌ఫ్రెండ్ అంటూ గౌరిని పరిచయం చేయడంతో 60 ఏళ్ల వయసులో అతడు మరోసారి పెళ్లి చేసుకోబోతున్నట్లుగా కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. దీని గురించి తాజా ఇంటర్వ్యూలో ప్రశ్నించారు. దీనిపై ఆమిర్ స్పందిస్తూ..

"గౌరీ, నేను ఒకరికొకరం చాలా సీరియస్‌గా ఉన్నాం. మేము చాలా నిబద్ధతతో కూడిన బంధంలో ఉన్నాం. మేము పార్ట్‌నర్స్. మేము కలిసే ఉన్నాం. ప...