Hyderabad, మే 6 -- మూడేళ్ల బాలిక వియానా జైన్. ఆమెకు ఆరు నెలల క్రితం బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్లు తేలింది. ఆమె తల్లిదండ్రులు అన్ని రకాల శస్త్ర చికిత్సలు చేయించారు. కానీ ఆమె మరణం తథ్యమని చెప్పేశారు వైద్యులు.

ఏం చేయాలో తెలియక ఆ బాలిక తల్లిదండ్రులు తమ జైన మతాచారాన్ని పాటించారు. కూతురు చేత సంతారా ప్రతిజ్ఞ చేయించారు. ఇలా జరిగిన కొన్ని నిమిషాల తర్వాత వియానా జైన్ ప్రాణాలు కోల్పోయింది.

జైన మతంలో సంతారా ఎంతో ముఖ్యమైనది. జైనమత విశ్వాసాల ప్రకారం వ్యక్తి మరణానికి దగ్గరవుతున్నప్పుడు సంతారా ఆచారాన్ని స్వీకరించవచ్చు. ఈ ఆచారం ప్రకారం స్వీయ శుద్ధి, మోక్షాన్ని పొందే మార్గం ఇది. ఈ ఆచారంలో ఆ వ్యక్తి ఆహారం, నీటిని పూర్తిగా వదులుకుంటారు. స్వీయ ధ్యానంలో ఉంటారు. సంతారా కర్మను జైన సన్యాసులు చుట్టూ ఉండి జరిపిస్తారు. మరణం సంభవించే వరకు ఆహారాన్ని, నీటిని తీసుకోకుండా అ...