Andhrapradesh, జూలై 25 -- రాజ‌ధాని నిర్మాణంపై కొంత‌మంది పనిగ‌ట్టుకుని చేసే దుష్ప్ర‌చారాలు న‌మ్మ‌వ‌ద్ద‌ని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయ‌ణ కోరారు. ప్ర‌జ‌ల‌కు,అమ‌రావ‌తి రైతుల‌కు ఇచ్చిన మాట ప్ర‌కారం మూడేళ్ల‌లో ఖ‌చ్చితంగా నూటికి నూరు శాతం రాజ‌ధాని ప‌నులు పూర్తిచేసి తీరుతామ‌న్నారు.

అమ‌రావ‌తిలో జ‌రుగుతున్న ప్ర‌భుత్వ భ‌వ‌నాల నిర్మాణ ప‌నుల‌ను ప‌రిశీలించారు. సీఆర్డీఏ ఇంజినీర్ల‌తో క‌లిసి నేల‌పాడులోని నాన్ గెజిటెడ్ అధికారులు,గెజిటెడ్ అధికారులు టైప్ - 1,టైప్ -2,గ్రూప్ - డి ఉద్యోగుల క్వార్ట‌ర్ల‌ను ప‌రిశీలించారు. అక్క‌డ ప‌నులు జ‌రుగుతున్న వివ‌రాల‌ను అడిగి తెలుసుకున్నారు. ఆ త‌ర్వాత నేల‌పాడులో మీడియాతో మాట్లాడారు.

గ‌త ప్ర‌భుత్వం అమ‌రావ‌తిపై క‌క్ష‌తో ప్ర‌జ‌ల సొమ్మును దుర్వినియోగం చేసిందని మంత్రి నారాయణ విమర్శించారు. "అమ‌రావ‌తి విష‌యంలో తీసుకున్న నిర్ణ...