Hyderabad, ఆగస్టు 13 -- ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా పట్టువదలని విక్రమార్కుడిలా నిరంతరం శ్రమిస్తూ ఇండస్ట్రీలోని టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు తన వంతు కృషి చేస్తున్నారు సంతోషం మ్యాగజైన్ అధినేత సురేష్ కొండేటి. సంతోషం మ్యాగజైన్ పేరుతో 24 ఏళ్లుగా సురేష్ కొండేటి ఈ అవార్డులు ప్రదానం చేస్తున్న విషయం తెలిసిందే.

అదే విధంగా ఈ ఏడాది కూడా సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్, సంతోషం ఓటీటీ అవార్డ్స్ 2025 కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఆగస్టు 16న హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ వేదికగా జరగనున్న ఈ అవార్డుల కార్యక్రమానికి అతిరథమహారథులను ఆహ్వానిస్తున్నారు సురేష్ కొండేటి.

మరో మూడు రోజుల్లో నిర్వహించినున్న ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటూ సినీ ప్రముఖులతో పాటు ఏపీ, తెలంగాణలోని ప్రభుత్వ పెద్దలను కూడా ఆహ్వానాలు అందిస్...