Hyderabad, జూలై 21 -- మోహిత్ సూరి దర్శకత్వంలో తెరకెక్కిన 'సయ్యారా' మూవీ విడుదలైన మూడు రోజుల్లోనే 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. మూడు రోజుల్లోనే 'సయ్యారా' ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లను దాటింది. దేశవ్యాప్తంగా వందలాది హౌస్‌ఫుల్ షోలతో ఈ సినిమా అదరగొడుతోంది. దీంతో 'సయ్యారా' ఈ ఏడాది ఎనిమిదవ అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ మూవీగా నిలిచింది. దీని వసూళ్ల జోరు ఇప్పుడే మొదలైంది.

బాలీవుడ్ లో ఓ చిన్న సినిమా, అసలు స్టార్లే లేని మూవీ బాక్సాఫీస్ దుమ్ము దులుపుతోంది. నటి అనన్య పాండే కజిన్ అయిన అహాన్ పాండే లీడ్ రోల్లో నటించిన 'సయ్యారా' మొదటి రెండు రోజుల్లో ఇండియాలో రూ.48 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. ఇక నిర్మాతల ప్రకారం మూడో రోజైన ఆదివారం (జులై 20) మరో రూ.35 కోట్లను జోడించుకుంది.

దీంతో మొత్తం నెట్ వసూళ్లు...