భారతదేశం, డిసెంబర్ 18 -- రద్దీ దృష్ట్యా నేడు, రేపు, ఎల్లుండి(డిసెంబర్ 18, 19, 20వ తేదీల్లో) మూడు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టుగా దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఇందులో తిరుపతి, మంచిలీపట్నం నుంచి హైదరాబాద్‌కు స్పెషల్ ట్రైన్స్ ఉన్నాయి. తిరుపతి నుంచి కాచిగూడకు, మచిలీపట్నం నుంచి ఉమ్డానగర్‌కు మధ్య నడుస్తాయి.

రైలు నెంబర్ 07297 మచిలీపట్నం-ఉమ్డానగర్‌ ఈరోజు(డిసెంబర్ 18) రాత్రి 9:15 మచిలీపట్నం నుంచి బయలుదేరుతుంది. గుడివాడ, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ, చర్లపల్లి, మల్కాజిగిరి, కాచిగూడ స్టేషన్లలో ఆగుతుంది. శుక్రవారం ఉదయం 9:45కు ఉమ్డానగర్‌ చేరుకుంటుంది.

మరో ప్రత్యేక రైలు 07296 నెంబర్‌.. శుక్రవారం(డిసెంబర్ 19) రాత్రి 7.40గంటలకు తిరుపతి నుంచి బయలుదేరుతుంది. ఈ ట్రైన్ రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి, గుంటూరు, మిర్య...