Hyderabad, జూలై 18 -- శని మనం చేసే పనులను బట్టి ఫలితాలను ఇస్తాడు. మంచి చేస్తే మంచి ఫలితాలు, చెడు చేస్తే చెడు ఫలితాలు ఎదురవుతాయి. చాలామంది శని పేరు చెప్తేనే భయపడిపోతారు. శని న్యాయ దేవుడు. శనీశ్వరుడు ఏలినాటి శని అంటే అందరికీ భయం. అయితే ఆ వ్యక్తి మంచి పనులు చేసి, జాతకంలో శని స్థానం సరిగ్గా ఉంటే మంచి ఫలితాలు ఎదురవుతాయి. అదే ఆ మనిషి చెడు చేసి, జాతకంలో శని మంచి స్థానంలో లేకపోతే వినాశనం కలుగుతుంది.

శని ఈ సమయంలో మీన రాశిలో ఉన్నాడు. మూడు రాశుల వారు ఏలినాటి శనిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రాశుల వారిపై శని కఠినమైన దృష్టిని కలిగి ఉంటాడు. ఈ వ్యక్తుల ప్రతిచర్యను గమనించి దానికి తగ్గట్టుగా ఫలితాలను ఇస్తాడు.

మేష రాశి వారికి ఏలినాటి శని మార్చి 2025లో మొదలైంది. ఏడున్నర ఏళ్ల వరకు ఈ ప్రభావం ఉంటుంది. మేష రాశి వారు ఈ సమయంలో శని మొదటి దశలో ఉన్నారు. 2027లో రెండవ...