భారతదేశం, జూలై 29 -- ముంబయిలోని బాంద్రాలో అమీర్ ఖాన్ ఇల్లు. ఆ రోడ్ అంతా పోలీసులు క్లియర్ చేశారు. వెంటనే కుయ్ కుయ్ అనే సౌండ్ తో ముందు, వెనుకా ఎస్కార్ట్ వెహికల్స్. మధ్యలో బస్సులో 25 మంది యంగ్ ఐపీఎస్ లు. స్టార్ హీరో ఇంట్లోకి వాహనాలు వెళ్లాయి. దీంతో ఏం జరుగుతుందోననే టెన్షన్ మొదలైంది. కాసేపటికి ఆ వెహికల్స్ తిరిగి వెళ్లిపోయాయి. కానీ ఎందుకు వచ్చారనేది మాత్రం తీవ్ర ఉత్కంఠ రేపింది. దీనిపై ఇప్పుడు సమాధానం దొరికింది.

ప్రొబేషనరీ ఐపీఎస్ అధికారులు బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ ను కలవాలనుకున్నారు. అందుకే బస్సులో వెళ్లారు. ఐపీఎస్ అధికారులు ప్రయాణిస్తున్న బస్సును మూడు పోలీసు వాహనాలు ఎస్కార్ట్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. బాంద్రాలోని అమీర్ నివాసానికి అధికారులు మర్యాదపూర్వకంగా వెళ్లారని ఓ అధికారి వార్తా సంస్థ పీటీఐకి తెలిపారు.ప్రొబేషనరీ ఐ...