భారతదేశం, ఏప్రిల్ 21 -- తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ భూతం ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేసింది. ఎంతోమంది యువత ఆయుష్షును అర్ధాంతరంగా ముగిసేలా చేసింది. దీనిపై ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన వారిపైనా కేసులు నమోదు చేసింది. ఫలితంగా ఆన్ లైన్ బెట్టింగ్ కాస్త తగ్గింది. కానీ.. ఇన్నాళ్లు బెట్టింగ్ దోపిడీకి పాల్పడ్డ ముఠాలు ఇప్పుడు కొత్త దారిని ఎంచుకున్నాయి.

ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఈ సమయంలో ఆన్ లైన్ బెట్టింగ్‌పై గట్టి నిఘా ఉంది. దీంతో బుకీలు రూచ్ మార్చి.. మళ్లీ పాత పద్ధతిని ఎంచుకున్నారు. ఆఫ్ లైన్ బెట్టింగ్‌ దందా కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఏపీ-తెలంగాణ సరిహద్దు పట్టణాల్లో ఈ దందా జోరుగా సాగుతోంది. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, అశ్వరావుపేట, మధిర, కొత్తగూడెం, బూర్గంపాడు, భద్రాచ...