భారతదేశం, జూన్ 4 -- థియేటర్లలో రిలీజైన మూడు నెలల తర్వాత మలయాళ హారర్ థ్రిల్లర్ మూవీ వడక్కన్ మరో ఓటీటీలోకి రాబోతుంది. సూపర్ నేచురల్ పవర్స్, ఘోస్ట్ ఎలిమెంట్స్, థ్రిల్లింగ్ ఇన్వెస్టిగేషన్.. లాంటి కీ ఎలిమెంట్స్ తో సాగే ఈ మూవీ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించడం ఖాయమే. తెలుగు సినిమాల్లో విలన్, సపోర్టింగ్ రోల్స్ చేసే కిశోర్ ఈ మూవీలో లీడ్ క్యారెక్టర్ లో అదరగొట్టారు.

ఈ ఏడాది మార్చి 7న థియేటర్లలో రిలీజైన వడక్కన్ మూవీకి మంచి రెస్పాన్స్ దక్కింది. ఈ మలయాళ సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ ఆడియన్స్ ను బాగానే ఎంగేజ్ చేసింది. ఈ మూవీ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళ ఫస్ట్ పారానార్మల్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ మూవీ మే 5 న ప్రైమ్ వీడియోలోకి వచ్చేసింది. ఇంగ్లిష్, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది.

ఫస్ట్ మలయాళ పారానార్మల్ థ్రిల్ల...