Hyderabad, ఆగస్టు 28 -- వెర్సటైల్ హీరో విశాల్ డిఫరెంట్ సినిమాలతో అలరిస్తుంటాడు. ఎప్పటికప్పుడు కంటెంట్ ఒరియెంటెడ్ సినిమాలతో తమిళ స్టార్ హీరో విశాల్ ఇప్పుడు మరో కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. విశాల్ నటిస్తోన్న లేటెసట్ మూవీ మకుటం. ఈ సినిమాతో ప్రేక్షకుల్ని మెప్పించేందుకు రెడీ అవుతున్నాడు విశాల్.

సౌత్ హీరో విశాల్ 35వ ప్రాజెక్ట్‌గా రాబోతోన్న ఈ 'మకుటం' సినిమాని సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద ఆర్‌బి చౌదరి నిర్మిస్తున్నారు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో వస్తున్న 99వ చిత్రంగా వస్తున్న మకుటంను భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఇక మకుటం మూవీకి రవి అరసు దర్శకత్వం వహిస్తున్నారు.

ఇటీవల రిలీజ్ చేసిన మకుటం టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సముద్రం మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో మకుటం కథ ఉంటుందని టీజర్ ద్వారా తెలుస్తోంది. ఇక తాజాగా మకుటం సినిమా ను...